విశాలాంధ్ర ధర్మవరం;; కర్ణాటక రాష్ట్రం పావగడలోని వై ఎన్ ఎస్ కోట గ్రామానికి చెందిన ఫయాజ్ భాష నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లి తిరిగి వచ్చు ప్రయాణంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో తన స్వగ్రామానికి వస్తున్నారు. మదనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తన హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. దీంతో ధర్మవరం చేరుకోగా అక్కడి జిఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న జి ఆర్ పి పోలీసులు విచారణ చేపట్టి, అనంతరం వారు మాట్లాడుతూ సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ధర్మవరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నాలుగు వద్ద గుర్తించి పరిశీలించడం జరిగిందన్నారు. అక్కడ ఉన్న స్వీపర్సును పురాయించగా రైలులోని ఎస్-2 కోచ్ బాత్రూం సమీపంలో హ్యాండ్ బ్యాగ్ ను స్వీపర్ ప్రసన్న మహాలక్ష్మి కు దొరకడం జరిగిందన్నారు. పై అధికారుల ఉత్తర్వులు మేరకు ఫిర్యాదు చేసిన ఫయాజ్ భాషకు స్వాధీన పరిచారు. స్వాధీన పరిచిన వాటిలో మూడు సెల్ ఫోన్లు (విలువ 16,000) ఆధార్ కార్డులు ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఆర్పి పోలీస్ సిబ్బంది షణ్ముఖనంద రెడ్డి, రుక్సానా తదితరులు ఉన్నారు.
నగదు, సెల్ ఫోన్లను అందజేసిన ధర్మవరం జి ఆర్ పి రైల్వే పోలీసులు
- Advertisement -
RELATED ARTICLES


