మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘం ప్రాంగణంలో దాదాపు 87 మంది వీధి వ్యాపారులతో లోక్ కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణస్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వామిజి 2.0 లోక్ కళ్యాణ్ మేల పథకం ద్వారా వీధి విక్రయదారులు చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పీఎంఎస్ వనిది లబ్ధిదారులు తో పాటు కుటుంబ సభ్యుల సామాజిక ఆర్థిక ప్రొఫైలింగును నిర్వహించి వారిని స్వనిధి సి సమృద్ధి కింద కేంద్ర సంక్షేమ పథకాలకు 15వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు రుణము ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడత గతంలో ఉన్న పదివేల రూపాయలను 15 వేలకు రెండవ విడత గతంలో ఉన్న వారికి 20 వేల నుండి 25 వేల రూపాయలకు మూడవ విడతలో ఉన్న వారికి 50 వేల రూపాయల నుండి మరో 50 వేల వరకు పెంచినట్లు తెలిపారు. అనంతరం మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ పెనుగోలు భాస్కర్ మాట్లాడుతూ సకాలంలో రిపైర్మెంట్ చేసిన వారికి 7 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన వీధి విక్రయదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే పట్టణంలో ప్రత్యేక వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి అందులోనే వ్యాపారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్ దొరయి, అసిస్టెంట్ మేనేజర్ బి రెడ్డి సాగర్ పాల్గొని పీఎం శివానిది రుణాలు తీసుకొని సక్రమమైన వాయిదాలలో చెల్లించిన వారికి తిరిగి రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అనంతరం సిటీ మిషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పథకం గురించి విధివిధానాలు అన్నింటిని వీధి విక్రయదారులకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డు సచివాలయ మేనేజర్ అశ్వత్ నారాయణ, ధర్మవరం సి ఓ లు, పట్టణ సమైక్య ఒబిలు, సలాం సమైక్య ఆర్పీలు వీధి విక్రయదారులు పాల్గొన్నారు.
వ్యాపారులతో లో కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సు..
- Advertisement -
RELATED ARTICLES


