విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యము అని శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయమునందు పేద ప్రజల కొరకు 124వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరములుగా ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరములను దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జాపకార్థం వీరి కుమారుడు దాసరి ప్రమీల, దాసరి మంజునాథ్ అండ్ సన్స్ వారు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. నిష్ణాతులైన వైద్యులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీప్ నేత, డాక్టర్ విట్టల్, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ వినయ్ రచయిత రోగులకు వైద్య చికిత్సలను అందించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. 295 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధనాదం వెంకటరమణ, కాచర్ల నారాయణస్వామి, సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, బంధనాదం చిన్నికృష్ణ, మేకల శివయ్య, మామిళ్ళ అశ్వత్థ నారాయణ, పెద్దకోట్ల భాస్కర, పెద్దకోట్ల విజయ్, చందా జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం.. శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
- Advertisement -
RELATED ARTICLES


