Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తాం

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తాం

- Advertisement -

చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందించేలా చర్యలు చేపడతామని చైర్మన్ తల్లం నారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా స్కూల్ నందు నెలవారి సమావేశంను సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. మన సంస్థ కమిటీ సభ్యుడు భాస్కర్ (శివయ్య) నిరంతరం అనాథ శవాల అంతిమ సంస్కార సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారని,
అటువంటి సేవా తత్పరుడు భాస్కర్ (శివయ్య)కు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి సంస్థ అధ్యక్షులు జగ్గా వేణు గోపాల్ వివరించారు.సంస్థ తరఫున గర్భిణి స్త్రీలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిరంతరం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.సంస్థ ఏర్పాటు చేసిన 3 ఉచిత బాడీ ఫ్రీజర్ బ్యాక్స్ సేవా కార్యక్రమానికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది అన్నారు. ఈ సేవా కార్యక్రమం ప్రారంభించిన రెండు సంవత్సరాల కాలంలో ధర్మవరం చుట్టు పక్కల మండల ప్రాంతాల ప్రజల అవసర నిమిత్తం 545 పర్యాయములు ఉచిత బాడీ ఫ్రీజర్ బ్యాక్స్ సేవ అందించడం జరిగింది అని తెలిపారు.సంస్థలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందని సభ్యులు ఎక్కువ సంఖ్యలో చేరి సంస్థ సేవా కార్యక్రమాలకు చేయుతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 2026-27 సంవత్సరంనకు గాను నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అధ్యక్షులు శంకర నాయుడు కార్యదర్శి న్యాయవాది గుంటెప్ప , కోశాధికారి సల్లా చంద్ర శేఖర్ , ఉపాధ్యక్షులు మంజునాథ్, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ , డైరెక్టర్ ఆంజనేయ చౌదరి , సలహాదారులుగా మనోహర్ గుప్తా, ప్రతాప్ రెడ్డి , రవికుమార్ ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు