డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని పలు పల్స్ కేంద్రాలలో 96 జాతము నమోదు కావడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 58 పల్స్ పోలియో భూత్ కేంద్రాలను, ఆరు మొబైల్ టీవీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు జిల్లా డిఎం అండ్ హెచ్ వో ఫై రోజా బేగం ఆకస్మిక తనిఖీలు చేసి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ పల్స్ పోలియో కార్యక్రమం యొక్క వివరాలను అడిగి తెలుసుకుని, పలు రికార్డులను కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. మొత్తం 11,520 మంది 0-5 సంవత్సర వయసుగల పిల్లలు ఉన్నారని, ఇందులో మొదటి రోజు 10,800 మందికి పల్స్ పోలియో చుక్కలు వేయడంతో 96 శాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఇంకనూ మిగిలి ఉన్న చిన్నారులకు సోమవారం, మంగళవారం రోజులలో సిబ్బంది ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలను వేస్తూ నూరు శాతం పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సజావుగా జరిగిన పట్టణ పల్స్ పోలియో కార్యక్రమంలో 96 శాతము నమోదు
- Advertisement -
RELATED ARTICLES


