Homeజిల్లాలుశ్రీ సత్యసాయిలయన్స్ క్లబ్ సేవలను ప్రజలకు మరింతగా అందిస్తాం నూతన కమిటీ వెల్లడి

లయన్స్ క్లబ్ సేవలను ప్రజలకు మరింతగా అందిస్తాం నూతన కమిటీ వెల్లడి

- Advertisement -

ధర్మవరం;; పట్టణములోని ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట లో గల ఎల్ సి కె పురమునందుగల లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో 2026-27 సంవత్సరమునకు నూతన కార్యవర్గాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షునిగా గవ్వల రాధాకృష్ణ (ఒంటి కొండ), కార్యదర్శిగా కొత్త శ్రీరాములు, కోశాధికారిగా ముక్తాపురం విజయ్ కుమార్ ను ఎంపిక చేశారు. నూతన కమిటీ వారికి పి డి జె రమేష్ నాథ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ దేశ, రాష్ట్రస్థాయిలో లయన్స్ క్లబ్ సేవలు కు విశేష గుర్తింపు కలదని తెలిపారు. లక్షల మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించి కంటి వెలుగును ప్రసాదించిన ఘనత లయన్స్ క్లబ్ కే దక్కిందని తెలిపారు. అంతేకాకుండా వివిధ సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా క్లబ్ నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, మోహన్ దాస్, గోశే రాధాకృష్ణ, వేణుగోపాల్, బండి వేణుగోపాల్, వేణుగోపాల్, నాగరాజు, కృష్ణ, సాగ సురేష్, జగదీష్ పాల్గొని లయన్స్ క్లబ్ ను మరిన్ని సేవా కార్యక్రమాలలో కొనసాగిస్తామని తెలియజేశారు. నూతన కమిటీ వారిని ఘనంగా సన్మానించారు. తదుపరి ఆసుపత్రి సిబ్బందికి నూతన వస్త్రములను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు పిట్టా వెంకటస్వామి కుమారుడు రాజీవ్నేత తో పాటు లయన్స్ క్లబ్ సీనియర్, జూనియర్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు