–పాఠశాల కరస్పాండెంట్ సివి శేషు
విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 8వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 5 వ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్ కరాటే, తైక్యండో ఛాంపియన్ షిప్ 2026, భాగంగా జరిగిన 11 సంవత్సరాల వయసుగల కేటగిరీ విభాగం లో ధర్మవరం పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ స్కూల్ లో చదువుచున్న కె. శశికుమార్ రెడ్డి (కటాస్ ) లో మొదటి బహుమతి, స్వర్ణ పతకం అలాగే కుముతి ఫైటింగ్ లో రెడవ ఫ్రైజ్, సిల్వర్ పతకం సాధించాడు. శశికుమార్ రెడ్డి కి కరాటే మాస్టర్ రమేష్ కరెస్పాండెంట్, సివి. శేషు , పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సివిశేషు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు వివిధ క్రీడల్లో కూడా చక్కటి శిక్షణ ఉంటుందని తెలిపారు. అందుకే ప్రతి విద్యార్థి విద్య తో పాటు క్రీడాల్లో కూడా రాణించాలని తెలిపారు.
ధర్మవరం విద్యార్ధికి అంతర్జాతీయ కరాటే పోటీలో స్వర్ణ పతకం
- Advertisement -
RELATED ARTICLES


