విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని శివానగర్ లో గల తిక్క స్వామి కొట్టాల వద్ద కిషోర్ కుమార్ అనే యజమాని ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధము కాగా, ఒకటిన్నర లక్ష నష్టము వాటిలినట్లు బాధితుడు కిషోర్ కుమార్ తెలిపారు. వివరాలకు వెళితే మధ్యాహ్న సమయంలో కిషోర్ కుమార్ బయటకు వెళ్లగా, అనుకోకుండా ఇంట్లో ఓ గదిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అతనికి సమాచారాన్ని అందించారు. అనంతరం ఫైర్ ఆఫీసుకు సమాచారాన్ని అందించారు. అంత లోపలే ఇంట్లో ఉన్న బట్టలు పరుపులు, కొంత నగదు పూర్తిగా దగ్ధమైంది. తదుపరి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తెచ్చింది. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారాన్ని అందుకున్న తాసిల్దార్ సురేష్ బాబు అక్కడికి చేరుకొని సమాచారాన్ని సేకరించి, అత్యవసరంగా నిత్యవసర సరుకులను వారు అందజేశారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. బాధితుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ నాకు ఒకటిన్నర లక్ష రూపాయలు నష్టం వాటి లేదని కట్టు బట్టలతో తాను బయటికి రావడం జరిగిందని, నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, బాలకృష్ణ, ధనుంజయ, విశ్వనాథ్, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నార
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
- Advertisement -
RELATED ARTICLES


