- Advertisement -
విశాలాంధ్ర – రాజాం : రాజాం టీడీపీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు నంది సూర్యప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ టంకాల కన్నం నాయుడు, టౌన్ క్లస్టర్ ఇన్‌చార్జ్ మరిపి జగన్‌మోహన్, టౌన్ యూత్ అధ్యక్షుడు కొంపల్లి రవికుమార్, వార్డు ఇన్‌చార్జులు గంధి గోపి, కాటం శ్రీనివాసరావు, నల్లా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


