రైతు సంఘం జిల్లా నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం;; పాత ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే కొనసాగించాలని కోరుతూ రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి ఆ స్థానంలో జి రాంజీ పేరుతో తెచ్చిన చట్టాన్ని వెంటనే రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. 2005 ఉపాధి హామీ చట్టం అమలు జరిగిన చోట గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం ఆర్థిక స్వాతంత్రం భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించింది అన్నారు. కేంద్రం 60 శాతమురాష్ట్రాలకు వారంపడేలా 40 శాతము నిధులు ఖర్చు పెట్టాలని తెలిపారు. చట్టము 73,74 పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా పని హక్కును కాలరాస్తు, జి రాంజీ చట్టం చేయడం కోట్లాదిమంది పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, చేనేత నాయకులు హెచ్ హెచ్ భాష ,సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి శేషంపల్లి మారుతి జేవీ రమణ,ఎల్ ఆదినారాయణ, గుంపు హరి, ఆంజనేయులు ,నరసింహారెడ్డి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి
- Advertisement -


