విశాలాంధ్ర – పెద్దకడబూరు : తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన కోడిగుడ్ల ఏసేపును గురువారం పెద్దకడుబూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి, మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ లు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన
ఏసేపు అనుభవం, అంకితభావం, పార్టీపై నిబద్ధత జిల్లాలో పార్టీ బలోపేతానికి దోహదపడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాల సాధనలో ఆయన మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్ధకల్, దుబ్బన్న, తిమ్మప్ప తదితరులు ఉన్నారు.
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణస్వీకారం చేసిన కోడిగుడ్లు ఏసేపు
- Advertisement -
RELATED ARTICLES


