. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు
విశాలాంధ్ర – రాజాం : గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న దాడిని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు పిలుపునిచ్చారు. గురువారం రాజాం మండలం కంచరం గ్రామంలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.800 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం దుర్మార్గమని విమర్శించారు. ఉపాధి పనుల్లో ప్రమాదం జరిగితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.
ఈ నెల 9వ తేదీన మండల కార్యాలయం వద్ద ఉపాధి హామీ ఏపీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్‌తో పాటు వ్యవసాయ కార్మిక నాయకులు పాల్గొన్నారు.


