Wednesday, February 18, 2026
Homeజిల్లాలుతూర్పు గోదావరిభూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

భూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు మండలం స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పాఠశాలలో గ్రీన్ స్కూల్ అనే అంశం లో భాగంగా భూసారాన్ని పరిరక్షించి, హరిత వనాలను కాపాడే విధానం పై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడదవోలు బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్, సహాయ వ్యవసాయ సంచాలకులు పి.చంద్రశేఖర్, నిడదవోలు మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు నేలను పరిరక్షించే పద్ధతులు, మొక్కలు పెంచడం వలన కలిగే లాభాలు, వాతావరణ కాలుష్యాన్ని నివారించే పద్ధతులు, గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే నష్టాలు, ఓజోన్ పొర యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగినది. దాంతోపాటు నేల సారాన్ని తెలుసుకొనేందుకు మట్టి నమూనాలను సేకరించే విధానం,పరీక్ష చేసిన తర్వాత వాటి వివరాలు రైతులకు ఏవిధంగాఉపయోగపడతాయో తెలియజేయడం జరిగినది. తద్వారా రైతులు నేలలోని పోషకాల ఆధారంగా ఎరువులు వాడకం, సమస్యాత్మక భూములు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవటం, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవశ్యకతను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ ఏ ఆర్ ఫిలిప్, బయాలజీ టీచర్స్, పిడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు