Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఏలూరుజనరల్ కేటగిరిలో 7 మద్యం బార్లు (2026-28) లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు..

జనరల్ కేటగిరిలో 7 మద్యం బార్లు (2026-28) లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు..

- Advertisement -

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియ…

విశాలాంధ్ర – ఏలూరు: ఏలూరు జిల్లాలో కేటాయించిన 7 మద్యం బార్లుకు 28 ధరఖాస్తులు రాగా బార్లు కేటాయింపులు పక్రియను అర్జీదారులు సమక్షంలో అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు.జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రభుత్వం కేటాయించిన 7 మద్యం బార్లుకు 28 ధరఖాస్తులు రాగా బార్లు కేటాయింపులు పక్రియను అర్జీదారులు సమక్షంలో నిబంధన మేరకు పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేశామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధిలో 6 బార్లు,జంగారెడ్డిగూడెం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధిలో 1 బారు మొత్తం 7 బార్లకు 28 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు.జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2026–28 మూడు సంవత్సరాలకు సంబంధించి బార్ల కేటాయింపులకు లాటరీ ప్రక్రియ ధరఖాస్తుదారులు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ నియమ, నిబంధనలు మేరకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు.జిల్లాలో లాటరీ పద్ధతిలో 7 బార్లును దక్కించుకున్న వారి జాబితా 1,బసు సాంబశివరావు 2,ఎరకల నాగ వెంకట కామాక్షి 3, సుంకర శ్రీదేవి 4,తల్లూరి శివ రామారావు 5, ఎర్రగోగు భాను ప్రకాష్ 6, ఆరేపల్లి సంతోష్ కుమార్ 7, మద్దుల జగదీశ్వర వేణుగోపాల్ లు ఉన్నారు.లాటరీ నిర్వహణ ప్రక్రియలో జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనరు బి.శ్రీలత,జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఏ.ఆవులయ్య, ఎక్సైజ్ శాఖ సిఐలు జి.శ్రీకృష్ణ ధనరాజు, కె.శ్రీనుబాబు, ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు, సిబ్బంది,బార్లు దరఖాస్తుదారులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు