జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది పిల్లలకు అల్బెన్దాజోల్ పంపిణీ…
ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నిర్మూలిద్దాం…
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
విశాలాంధ్ర -ఏలూరు :పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ లో భాగంగా ఈనెల 17 నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జాతీయ నులిపురుగల నివారణ దినోత్సవ సందర్భంగా నులిపురుగులు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నివారణ మందు పంపిణి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారికి ఈనెల 17 నుండి 24 వ తేదీ వరకుక్ ఆల్బెండజోల్ నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 4, 08,012 అల్బెన్దాజోల్ టాబ్లెట్స్ సిద్ధం చేయడం జరిగిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర సంస్థలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం,మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణ వల్ల అనారోగ్యంకి గురవుతారని పేర్కొన్నారు. ఆహారం తీసుకునే సందర్భాల్లో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు.నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం,ఆకలి మందగించడం, బలహీరథ , కడుపు నొప్పి, వికారం,వాంతులు,విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అల్బెండో జోల్ మాత్రల తో వీటికి చెక్ పెట్టి ఆరోగ్యం గా ఉండవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీటిని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు పరీక్షించాలన్నారు.1-2 సం.రంల వయస్సు గల వారికి 200 గ్రాముల మోతాదు, 2-19 సం.రం. వయస్సు గల వారికి 400 గ్రాముల మోతాదు వేసుకోవాలన్నారు.మాత్రలను సురక్షితమైన త్రాగునీటితో మాత్రమే వేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలోని 2221 అంగన్వాడీ కేంద్రాలలో 70 వేల 625 మంది పిల్లలలకు, 2404 పాఠశాలల్లోని 2,55,207 మంది,184 కళాశాలల్లోని 46,281 విద్యార్థులకు, 1760 మంది చిన్నపిల్లలకు మొత్తం 3 లక్షల 73 వేల 873 మంది పిల్లలకు నులిపురుగులు నివారణ మాత్రలు అందించడం జరుగుతుందన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నలిపురుగు మాత్రలు వేయించి వారి ఆరోగ్యం పరిరక్షించాలని ఆమె తెలిపారు. దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుతీసుకునేలా కృషి చేయాలన్నారు. నులిపురుగులు వేసిన తరవాత ఏదైనా చిన్నపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైతే ఆందోళన చెందకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేలా తల్లితండ్రులకు అవగాహన కలిగించాలన్నారు.ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా.పి.జె.అమృతం,డిసిహెచ్ఎస్ డా.పాల్ సతీష్,ఎన్ సిడి జిల్లా ప్రొగ్రాం ఆఫీసరు నరేంద్రకృష్ణ, జెడ్పి సిఇఓ శ్రీహరి,ఏలూరు నగరపాలక సంస్ధ కమీషనరు ఏ. భానుప్రతాప్, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, ,ఐసిడిఎస్ పిడి శారద, ఎస్.వెంకటకృష్ణ,విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


