విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని టీడీపీ మాజీ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప అన్నారు. బుధవారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూనే, ప్రతి గ్రామంలో తాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేరవేయడమే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా నమోదు చేసి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీలు తలారి అంజి, నాగేంద్ర, ప్రభాకర్, శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
- Advertisement -


