ధర్మవరం డిఎస్పి,బీవీ జగన్నాథరాజు
విశాలాంధ్ర ధర్మవరం;; జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యాలయాలు ఉన్నాయని, ఇందులో భాగంగా ధర్మవరం డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లకు ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కార్యాలయమును ఏర్పాటు చేయడం జరిగిందని, కావున పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ను డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లో సద్వినియోగం చేసుకొని భార్యాభర్తల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ధర్మవరం డిఎస్పి బీవి. జగన్నాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. అనంతరం పోలీస్ కౌన్సిలింగ్ తీరును సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్ పరిధిలోని పట్నం పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన భార్యాభర్తల జంటను దాదాపు నాలుగు గంటలసేపు కౌన్సిలింగ్ నిర్వహించి ఆ కాపురాన్ని విజయవంతంగా నూతన జీవితం తిరిగి ప్రసాదించడం జరిగిందని తెలిపారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్వహిస్తూ ఇప్పటికీ 40 మంది భార్యాభర్తల జంటలను కలపడం అభినందినీయమని తెలుపుతూ ఆ సభ్యులను వారు అభినందించారు. తదుపరి ధర్మారం డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లో గల సిఐలు లేదా ఎస్సైలు తమ స్టేషన్లో వచ్చే భార్యాభర్తల సమస్యలును ఒకరోజు ముందుగా సభ్యులకు తెలియజేయాలని తెలిపారు. ప్రతిరోజు పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ జరుగుతుందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు రిటైర్డ్ హెడ్మాస్టర్ చలపతి, లాయర్ బాలసుందరి, ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాభవాని, పాత్రికేయులు రాఘవ, ధర్మవరం సిఐలు, పట్నం ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ ఫ్యామిలీ కౌన్సిల్ను అందరూ సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


