- Advertisement -
–పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మార్వో నాగరాజు నాయక్
విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పరిధిలోని వ్యవసాయ పట్టాదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను నిడదవోలు ఎమ్మార్వో నాగరాజు నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగరాజు నాయక్ మాట్లాడుతూ రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు రుణాలు పొందడం, పంటల బీమా వంటి ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అట్లపాడు రైతులు, కూటమి సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


