Thursday, January 15, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ…

మున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ…

- Advertisement -

తొర్లికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-తొర్లికొండ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ కార్యక్రమముగా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ అన్నారు శుక్రవారం స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో తొర్లికొండ ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కార్మికులకు 150 మందికి 150 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ట్రస్టు ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకొని కొనియాడారు ప్రతి ఒక్కరు కూడా సేవ మార్గంలో నడవాలని కోరారు ట్రస్ట్ నిర్వాహకులు తొర్లికొండ సీతారామయ్య ను వారు అభినందించారు ప్రస్తుత సమాజంలో నేను నా కుటుంబం అని మాత్రమే ఆలోచిస్తున్న రోజుల్లో ఎలా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఘనమైన కీర్తిని సంపాదించుకోవడమేనని కొనియాడారు గత పది సంవత్సరాలుగా తొర్లికొండ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లతోపాటు వికలాంగులకు ట్రై సైకిళ్లు వృద్ధాశ్రమాల్లో కొన్నిచోట్ల రూములు ఏర్పాటు చేయటం స్కూల్ లలో బోర్లు వేయించడం పుష్కర సమయాలలో కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నోచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించటం వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తొర్లికొండ వెంకట్రావు, సీతారామయ్య,డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ,బండారు కేదార్నాథ్ శర్మ,మందలపు సీతారామయ్య,కోప్పు సాయి, వై ఎస్ ఎన్ బాబు,నల్లని రాఘవ,పులిపాటి లక్ష్మణరావు,మునుగంటి కామేశ్వరరావు,గోపు సుబ్రహ్మణ్యం,మారం అమరయ్య,పబ్బతి సీతారామ గుప్త,తుటారి కృష్ణ,ఎర్రగొర్ల లక్ష్మణ్,మురుమూరు శివ, రజియా బేగం,లక్ష్మీ,నవీన్,కొట్టే బద్రి,చల్ల గాంధీ,మారం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు