Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ

ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ బేస్ లైన్ అసైన్మెంట్ లో భాగంగా ఎంఈఓ రాజేశ్వరి దేవి డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ డైట్ లెక్చరర్ మేరీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టు వర్కుల్ని ప్రదర్శించిన తీరు పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు కూడా రాబట్టారు. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 విద్యార్థులు యొక్క కృషిని వారు కొనియాడారు. తదుపరి మెగా పిటిఎం ఆహ్వాన పత్రికలను వారు విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జానకి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు