విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే దిశగా రాజాం శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతి ఏడాది నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం (పిక్నిక్) ఈ నెల 7వ తేదీ ఆదివారం జరిగనుంది. డోలపేటలోని పొట్ట చిట్టిబాబు తోటలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రంప జగదేశ్వర శర్మ, కె. తిరుమలేశ్వర రావు, కె. మధు, కె.వి.ఎస్.కె.జె. శర్మ మాట్లాడుతూ… సమ్మేళనం ద్వారా సభ్యులు మాత్రమే కాకుండా కొత్త తరాలకు కూడా సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు పరిచయం చేయడం లక్ష్యమని తెలిపారు. పరస్పర పరిచయం, పరస్పర సహకారం మరింత బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లల కోసం క్రీడాపోటీలు, మహిళల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భోజన విందు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంఘ అభివృద్ధి, సేవా కార్యక్రమాల రూపురేఖలపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు.సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.


