జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ
విశాలాంధ్ర ధర్మవరం;; నేటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందిస్తోందని, ఉపాధ్యాయులు సమన్వయంతో తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీతో పాటు స్థానిక ఆర్డివో మహేష్, మండల విద్యాశాఖ అధికారి -1 రాజేశ్వరి దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విద్యార్థుల ఎదుగుదలకు ఒక వేదిక తయారైంది అని తెలిపారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉపాధ్యాయులు సమన్వయంతో సమానమైన విద్యను బోధించాలి అని తెలిపారు. అప్పుడే పునాది గట్టి పడుతుందని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన చదువు విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. సమన్వయంతో ఉపాధ్యాయులు విద్యను అందిస్తే పాఠశాల మంచి ప్రగతి బాటలో వస్తూ మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. పాఠశాలలో ఉన్న విద్యార్థినిలు అందరూ కూడా ఉపాధ్యాయులు తమ కుటుంబములోని పిల్లలుగా భావించి, మంచి విద్యను అందించాలని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకొనే అవకాశం ఉందని, తద్వారా విద్యార్థినీలు మంచి అభివృద్ధి బాటలో నడుస్తారని తెలిపారు. ముఖ్యంగా పదవ తరగతి వారికి నూరు రోజుల చదువు ప్రణాళిక నూరు శాతం ఉత్తీర్ణత తెస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపట్ల సహకారం అందించాలన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది అని వారు గుర్తు చేశారు. ఉపాధ్యాయులు మొక్కుబడిగా కాకుండా విద్యను విద్యార్థులకు సేవతో బాధ్యతతో విధులను నిర్వర్తించాలని తెలిపారు. మరి పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత హెడ్మాస్టర్ దేనిని తెలిపారు. పాఠశాలలో జరిగే ప్రతిసారి ఆత్మీయ సమావేశంలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని తెలిపారు. పునాదిలోనే చదువు బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మీద ఎన్నో రకాలుగా వివిధ పథకాలను అందించడం జరిగిందని, వాటిని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది అని వారు గుర్తు చేశారు. పాఠశాలల్లో విద్య విషయంలో సమన్వయ లోపం ఉంటే విద్య అభివృద్ధి కాదు అని తెలిపారు. ఉపాధ్యాయునికి నేటి సమాజములో ఉన్న విలువ మరెవ్వరికీ లేదు అని వారు తెలిపారు. అదేవిధంగా విద్యార్థినీల విషయంలో బాల్య వివాహముకు తావు ఇవ్వరాదని తెలిపారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు విద్యార్థినిల తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి తరగతిలోని తరగతి ఉపాధ్యాయులు తప్పనిసరిగా అన్ని విషయాలలో (సబ్జెక్ట్ లలో) విద్యార్థులు ఎలా ప్రగతి సాధిస్తున్నారు అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆయా సబ్జెక్టు టీచర్లతో, హెడ్మాస్టర్ లతో తప్పక సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. అప్పుడే వెనుకబడిన విషయాలకు విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం బాల్య వివాహం చేసుకోరాదన్న విషయంపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వివాహం కాకుండా చదువు విషయం మీదే శ్రద్ధ కనిపరిస్తే మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరి దేవి, పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్, పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీదేవి, వైస్ చైర్మన్ సాహిన, ఇన్చార్జి ఎంఆర్ఓ ఈశ్వరయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


