Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈవీఎం గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చేతన్

ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చేతన్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గల ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈవీఎం గోడౌన్లకు భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని సూచించారు. సంబంధిత అధికారులు అప్పుడప్పుడు ఆకస్మికంగా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు