Homeజిల్లాలుశ్రీ సత్యసాయికూటమి ప్రభుత్వం ప్రతి యోధుడికి తోడు – శారీరక పరిస్థితి కాదు, మనసే గొప్ప శక్తి....

కూటమి ప్రభుత్వం ప్రతి యోధుడికి తోడు – శారీరక పరిస్థితి కాదు, మనసే గొప్ప శక్తి. – హరీష్ బాబు

- Advertisement -

ధర్మవరం మార్కెట్ యార్డులో పారా స్పోర్ట్స్ ప్రచార యాత్ర ఘనంగా నిర్వహణ.


విశాలాంధ్ర ధర్మవరం; పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ధర్మవరం మార్కెట్ యార్డులో నిర్వహించిన పారా స్పోర్ట్స్ ప్రచార యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు పారా అథ్లెట్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా క్రీడలు కూడా సాధారణ క్రీడలకే సమానమైనవి. వీటిని పట్టించుకోవడం, ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశీస్సులు, మార్గదర్శకత వల్లే ఇలాంటి కార్యక్రమాలు పట్టణాలను దాటి గ్రామస్థాయికి విస్తరిస్తున్నాయి అని తెలిపారు. ప్రభుత్వం పారా క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వీరి కృషి, పట్టుదల మరెవరికీ తగ్గదని గర్వంగా ఉందన్నారు. ప్రచార యాత్రలో భాగంగా పారా అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రజలలో స్పూర్తిని నూరిపోసారు అని తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలు, విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున హాజరై పారా క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సహకారంతో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రావడం పారా అథ్లెట్లకు భవిష్యత్తులో మరింత మెరుగైన విజయాలు సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్ర, బిజెపి నాయకులు పోతుకుంట రాజు, జనసేన నాయకులు అరిగెల భాస్కర్, బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు