Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరక్తదానం అనేది ఇరువురికి ప్రాణదానమవుతుంది..

రక్తదానం అనేది ఇరువురికి ప్రాణదానమవుతుంది..

- Advertisement -

శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి.. నిర్వాహకులు బీరే శ్రీరాములు
విశాలాంధ్ర ధర్మవరం;; రక్తదానం అనేది ఇరువురికి ప్రాణదానమవుతుందని శ్రీ చౌడేశ్వరీ దేవి సేవా సమితి-క్యాంపు నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్, వైయస్సార్ సర్కిల్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని వారు నిర్వహించారు. ఈ శిబిరానికి ట్రాఫిక్ ఎస్సై రాముడు, జిల్లా తొగట వీర క్షత్రియ అధ్యక్షులు దాసరి శ్రీరాములు, శంకర్, బంధనాదం అంజి, దాసరి శివ, మిద్దె మల్లికార్జున, బడిగేరి నాగరాజు, మేకల శివయ్య, ఉమ్మడిశెట్టి ప్రసాద్, కత్తి పెద్దన్న, శంకర్ యుగంధర్, యువర్ ఫౌండేషన్ వైకే శ్రీనివాసులు, ఇండియన్ రెడ్ క్రాస్ డాక్టర్ సత్య నిర్ధారన్, దుర్గమ్మ సేవా సమితి అనిల్ కుమార్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం బీరే శ్రీరాములు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం వీర జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. వారి స్ఫూర్తితోనే తాము ఈ రక్తదాన శిబిరము నిర్వహించామని, వారు దేశానికి చేసిన సేవను మరువలేమని తెలిపారు. నేడు భారతదేశమంతా మురళి నాయక్ చేసిన సేవలను కొనియాడుతోందని తెలిపారు. ఈ శిబిరం లో 34 మంది రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో వచ్చిన రక్తాన్ని గర్భిణీ స్త్రీలకు, ప్రమాదంలో అత్యవసరమైన వారికి, క్యాన్సర్ రోగులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రక్తదానంలో అపూహలకు తావు ఇవ్వరాదని తెలిపారు. ఆడ ,మగ అనే తేడా లేకుండా ఎవరైనా నువ్వు కూడా రక్తదానం చేసి మానవతను చాటుకోవాలని తెలిపారు. రక్తదానం చేసి ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చౌడేశ్వరి సేవాసమితి మిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు