Homeఆంధ్రప్రదేశ్నల్లజర్ల మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

నల్లజర్ల మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

- Advertisement -

విశాలాంధ్ర – నల్లజర్ల : మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామం వద్ద ఎర్ర కాలువ వరద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, తహసీల్దార్ నల్లజర్ల, ఇరిగేషన్ శాఖ డీఈఈ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎర్ర కాలువలో నీటి మట్టం పెరుగుదల, ముంపు ప్రభావిత ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి వంటి అంశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, “ఖమ్మం జిల్లా, భద్రాది కొత్తగూడెం జిల్లాల నుంచి ఎర్ర కాలువకు వరద నీరు వస్తోందనీ,  ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద నీరు వస్తే ఇక్కడ ముంపు ప్రభావం ఉంటుందో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కాలువ మొత్తం 4 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం 2.5 టీఎంసీ నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు.” రూట్ మ్యాప్ ఆధారంగా వరద నీటి ప్రవాహ దిశ, ముంపు ప్రమాద ప్రాంతాలను ఇంజినీరింగ్ బృందంతో సమీక్షించిన కలెక్టర్ అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి, కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసు కున్నారు. నల్లజర్ల మండల పరిధిలో 1,235 హెక్టార్లలో వరి సాగు జరగగా, మొంథా తుఫాను ప్రభావంతో 110 హెక్టార్ల పంట పడిపోయి, నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటి వరకు సేకరించిన డేటా ప్రకారం మండలంలోని 12 గ్రామాలకు చెందిన 83 మంది రైతులకు ఈమేరకు నష్టం జరిగిందన్న అంచనాలకి వొచ్చినట్లు అధికారుల నుంచి  ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా పిల్లకాల్వలు ఏర్పరచి, నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు పూర్తిగా పడిపోయిన కంకులను కట్టలుగా నిలబెట్టి, ధాన్యాన్ని రక్షించుకోవడం, మొలక రాకుండా ఉండటానికి 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, “ప్రజల భద్రత మరియు రైతుల పంట రక్షణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల నష్టాలను అంచనా వేసి, తక్షణ సాయం అందించే చర్యలు చేపడతాం అన్నారు. ప్రభుత్వం ప్రజలతో పాటు నిలబడి, ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తుందన్నారు. అధికారులు  శాఖల మధ్య సమన్వయంతో పని చేసి ఎవరూ ఆందోళన చెందకుండా చూడాలనీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు