వాసవి అక్షర
పుట్టినరోజు మానసిక దివ్యాంగులకు చాపలు
దుప్పట్లు అన్నదానం*
ongole
పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలు గా చేసుకోవడం మంచి సంప్రదాయ మన్న మానవత సేవా సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు…..
పుట్టినరోజులను ఆర్భాటంగా చేసుకునే ఆనవాయితీ నుండి సేవా కార్యక్రమాలు వైపు దృష్టి సాగించడం అభినందనీయం అని మారెళ్ళ సుబ్బారావు అన్నా రు. లక్ష్మీ వాసవి అక్షర జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రామకృష్ణ నిరుషా దంపతుల ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్ లోని ఉమా మనోవికాస కేంద్రం దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు దివ్యాంగులకు చాపలు దుప్పట్లు పంపిణీ తో పాటు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు .
ఈ సందర్భంగా మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల ద్వారా తమ పుట్టినరోజులను జరుపుకుంటే ఇంకొకరికి మేలు చేసినవారు అవుతామని పేర్కొన్నారు. ఈ సేవ కార్యక్రమంలో దేసు వెంకట సుబ్బారావు భాగ్యలక్ష్మి అనిల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


