రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు… ఎమ్మెల్యే ముప్పిడి
విశాలాంధ్ర – కొవ్వూరు : ధాన్యం అమ్మకాల్లో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వర రావు అన్నారు.
కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నూతన భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన వెంటనే సొమ్ములు చెల్లించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బేతిన ఎస్ మాధవరావు, సొసైటీ అధ్యక్షులు గారపాటి రామచంద్రరావు ఎడిఎ చింతల శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు బేతిన నారాయణ, ఆళ్ల హరిబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు


