ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: డ్రగ్స్ వినియోగం విద్యార్థుల జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని, కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా డ్రగ్స్ కు తప్పనిసరిగా దూరంగా ఉన్నప్పుడే సుఖవంతమైన జీవితము లభిస్తుందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో మాదకద్రవ్యాల వాడటం వలన కలిగే దుష్పరిణామాలు కలిగే నష్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులతో మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంగా పనిచేస్తుందని తెలిపారు. రక్షను వినియోగించడం వలన రక్త ప్రసరణ వేగవంతంగా జరుగుతుందని దీంతో శరీరంలోని అవయవాలు, మెదడు పూర్తిగా దెబ్బతిని బుద్ధి మాంద్యం లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించిన విద్యార్థులను ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమైన నగరాలలో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ వాడిన వారికి కేసు అనగా ఎఫ్ఐఆర్ నమోదైతే నాన్బెయిలబుల్ ఉంటుందని 10 సంవత్సరాల శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా కూడా ఉంటుందని వారు తెలిపారు. విద్యార్థుల జీవితాలలో డ్రగ్ వాడకంపై ఎఫ్ ఐ ఆర్ నమోదైతే జీవితాంతం అలాగే ఉంటుందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాఠశాల హెడ్మాస్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ ,అధ్యాపక, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
డ్రగ్స్ వినియోగం విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తుంది..
- Advertisement -
RELATED ARTICLES


