Homeఆంధ్రప్రదేశ్ఏపీలో భూప్రకంపనలు.. వినుకొండకు సమీపంలో భూకంప కేంద్రం!

ఏపీలో భూప్రకంపనలు.. వినుకొండకు సమీపంలో భూకంప కేంద్రం!

- Advertisement -

పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు
ఏపీలో ల్నాడు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.  భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2:33 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ National Center for Seismology గుర్తించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. వినుకొండ Vinukonda కు 20 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.దీనిపై నిపుణులు స్పందిస్తూ… రాబోయే రోజుల్లో కూడా మరిన్ని భూకంపాలు రావచ్చని తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో తరచుగా భూమి కంపిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు