- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:పారిశ్రామిక అన్వేషణతోనే ఉపాధి కల్పన అందిపుచ్చుకోగలరని టిసిఎస్ నిపుణుడు శేషు కుమార్ పేర్కొన్నారు. శనివారం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థి లక్ష్యాలు, పారిశ్రామిక సృజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో మెలుకువలు, నైపుణ్యాలు, సమయపాలన, సృజనాత్మక పై అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ ఆచార్య పి చెన్నారెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలోప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్ జే. శ్రీనివాసులు పాల్గొన్నారు.


