ప్రశంసలు అందజేసిన మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్
విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో శిల్పారామం లో జరిగిన స్వచ్ఛ అవార్డ్స్ కార్యక్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ రామలాలిత్యా వారి శిష్య బృందం చే ంద్ర స్వర్ణాంధ్ర నృత్య రూపకం నాట్యం అందరిని అలరాలించింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, కలెక్టర్ శ్యాం ప్రసాద్ లు నాట్యం చేసిన విద్యార్థినీలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ సందేశాన్ని కూచిపూడి సైదిలో నటించి సమాజానికి సందేశం అందించినందుకు వారు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, రామ లాలిత్య వారు జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి గుర్తింపు పొందడం పట్ల వారు ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటివారు జిల్లాకే గర్వకారణం అని తెలిపారు.
అలరించిన నాట్యం
- Advertisement -
RELATED ARTICLES


