Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

సంతోషం వ్యక్తం చేసిన యువర్స్ ఫౌండేషన్ సంస్థ

విశాలాంధ్ర – ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) యువర్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం పట్ల అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన, క్యాంపు చైర్మన్ వై కే శ్రీనివాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య చికిత్సలు, ఆపరేషన్లు, కంటి అద్దాలను పేద ప్రజలకు నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో 82 మంది కంటి రోగులు హాజరుకాగా అందులో 40 మంది ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థం కాచర్ల కోనమ్మ కుమారుడు కాచెర్ల నటరాజ్ కోడలు సౌభాగ్య వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతలను వారు ఘనంగా సన్మానించారు. ఈ కంటి వైద్య శిబిరం యువర్స్ ఫౌండేషన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ – శ్రీ సత్యసాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లములు ఉన్న వారిని పరీక్షించి ఆపరేషన్కు అర్హులైన వారిని ఇదే రోజున ధర్మారం నుండి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు తరలించడం జరిగిందని తెలిపారు. బిపి, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు మామూలు ఆరోగ్య పరిస్థితిలో ఉన్న వారికి కూడా కంటి వైద్య చికిత్సలను అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నేత్ర జ్యోతి హాస్పిటల్ డాక్టర్ అయూష్, పిఆర్వో రాధాకృష్ణ, డాక్టర్ బి వి సుబ్బారావు, కోటేశ్వరరావు, కౌన్సిలర్ కేత లోకేష్, రామాంజనేయులు,మల్లికార్జున, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు