విశాలాంధ్ర – ఉరవకొండ : శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి యొక్క గొప్పతనాన్ని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు టిడిపి పార్టీ నాయకులు రేగాటి నాగరాజు, మోపిడి మాజీ సర్పంచ్ జంగడి గోవిందు, ఆమిద్యాల రామాంజనేయులు, బొక్కసం రాజశేఖర్, బావిగడ్డ ఆనంద్, వీరి తోపాటు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు.


