విశాలాంధ్ర, ఉరవకొండ : సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కి సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు ఈశ్వరప్ప, రమాదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ 2.0 సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
జీఎస్టీ అంశాలు, తగ్గింపు ధరల గురించి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పొందగలిగే లాభాలు, నిత్యావసర వస్తువులపై తగ్గింపులు, సాధారణ ప్రజలకు అందే సౌకర్యాలు గురించి ప్రచారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హై స్కూల్ ఉపాధ్యాయులు శివప్ప, సిఆర్పిలు గంగప్ప, పర్వతన్న, సాయి గీతా, మరియు స్వచ్ఛభారత మండల కోఆర్డినేటర్ జయప్రకాష్ గౌడ్ విద్యార్థులు పాల్గొన్నారు.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పోస్టర్ల ఆవిష్కరణ
- Advertisement -


