Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ..... సీపీఐ రాష్ట్ర...

ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ….. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్య ఎర్రజెండాలన్ని ఐక్యం కావలసిన అవస్యకత నెలకొందని, రాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలని, మావోయిస్టు సోదరులు మీ ప్రాణాలు చాలా అమూల్యమైన వని జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రజా ఉద్యమాలకు నిర్వహించి ప్రజలకు అండగా నిలుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య కోరారు. శుక్రవారం సీఆర్‌ భవన్‌లో సీపీఐ కర్నూలు జిల్లా కౌన్సిల్‌ సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ మునెప్ప అద్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు ,సీనియర్‌ నాయకులు పీ రామచంద్రయ్య , జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ లెనిన్‌బాబు, పూర్వపు జిల్లాకార్యదర్శి పీ భీమలింగప్పలు హాజరైనారు.జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ లెనిన్‌బాబు సంతాపతీర్మాణం ప్రవేశపెడుతూ ఇటీవల మృతి చెందిన సీపీఐ పూర్వపు జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు స్టాలిన్‌ బాబు ,చిన్నటేకూరు వద్ద మృతులకు, నివాళులు అర్పిస్తూ రెండునిముషాలు మౌనం పాటించారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ నేపాల్‌లో 9 కమ్యూనిస్టుపార్టీలు ఏకమై కార్యచరణ ప్రకటించి ఒక వేధికపైకి వచ్చినట్లు ఇక్కడ కూడా ఎర్రజెండాలు అన్ని ఐక్యం కావలసిన అవస్యకత ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో వందలాది మావోయిస్టు పార్టీ నేతలను , సభ్యులను హత్య చేస్తుందని 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తానని చెపుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్య మావోయిస్టుల ప్రాణాలు ఎంతో అమూల్యమైనవని వారు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. ప్రజాఉద్యమాలు నడిపి ప్రజలకు అండగా నిలుద్దామని పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి మరణ శాసనం రాస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 4111 పాఠశాలలు మూసివేశారని , యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పటించి సామాన్యులకు వైద్యవిద్యను అందని ద్రాక్షా మారుస్తుందన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది ఇంటర్‌ విద్యను అభ్యసిస్తుంటే సుమారు 9లక్షల మంది శ్రీచైతన్యం, నారాయణ, బాష్యం లాంటి కార్పొరేట్‌ సంస్థలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. డిశంబరు 26వ తేది తెలంగాణా రాష్ట్రం ఖమ్మలో నిర్వహించు శతజయంతి ఉత్సవాల ర్యాలీలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కమ్యూనిస్టులకు చావులేదని ఈదేశంలో పేదరికం ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారని నిరూపించాలన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా విజయం సాధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం సీపీఐ సీనియర్‌ నాయకులు పీ రామచంద్రయ్యలు ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య కార్యదర్శి నివేధిక సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు , వివిధ ప్రజాసంఘాల నాయకులు, కౌన్సిల్‌ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు