విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 27వ తేదీన జరిగిన చేతి వృత్తిదారుల సమైక్య సమావేశం కమిటీలో నిర్ణయించిన తీర్మానం ప్రకారం ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షులుగా ఈశ్వరయ్య ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏ రూపేనా ఆదుకోవడం లేదని, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేతి వృత్తిదారుల సమైక్య అభివృద్ధికి తమ తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ వారు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల సమైక్య అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మధు చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ చేతి వృత్తిదారుల సమైక్య అధ్యక్షుడుగా ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎంపిక..
RELATED ARTICLES