Monday, November 17, 2025
Homeజిల్లాలుఏలూరుపరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర-కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట వీర వెంకట సత్యనారాయణ (రవి) పేర్కొన్నారు. మండలంలో సరిపల్లి గ్రామంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయని, ప్రజా ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయని ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు