-ఎంపీడీఓ బి.విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని 26 గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తామని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భానురేఖ, డిప్యూటీ ఎంపీడీఓ సాకే ప్రేమ్ కుమార్ తో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ (రోజులో ఒక గంట) సంబంధించి చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. ప్రజలు ఇంట్లోని చెత్తను వీధుల్లో పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ అచ్యుతానంద బాబు, జూనియర్ అసిస్టెంట్ పార్వతి, సచివాలయ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


