ఆయన కృషితోనే సిపిఐ కు నందిగామ కార్యాలయ నిర్మాణం…
అనేక పార్టీలో ఉన్న ఎందరో నాయకులు ఆయన శిష్యులే…
విశాలాంధ్ర నందిగామ:-కామ్రేడ్ దివంగత సూర్యదేవర నాగేశ్వరరావు నందిగామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని సిపిఐ నియోజకవర్గ సీనియర్ నాయకులు వట్టికొండ చంద్రమోహన్ అన్నారు గురువారం దివంగత కామ్రేడ్ సూర్యదేవర నాగేశ్వరరావు పదవ వర్ధంతి సందర్భంగా నందిగామ ప్రధాన రహదారుల్లో సిపిఐ నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద దివంగత నాగేశ్వరరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నందిగామ గడ్డపైన సిపిఐ ఎన్నో ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఎన్నో ఉద్యమాలకు నాంది పలికి పేద ప్రజలకు అండగా సిపిఐ ఉందంటే దానికి పునాది సూర్యదేవర నాగేశ్వరరావు అని అన్నారు అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలలో అనేక పార్టీలో ఉన్న నాయకుల్లో ఎవరిని వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే సూర్యదేవర నాగేశ్వరరావు శిష్యులుగా ఎందరో ఉన్నారని పేర్కొన్నారు నందిగామ నియోజకవర్గానికి సిపిఐ ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందని దివంగత నాగేశ్వరరావు ఎందరో రాజకీయ నాయకులను తయారు చేశారని నాటి రోజుల్లోనే ఒక బలమైన నాయకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు ఆయన చేసిన అనేక సంస్కరణల వలన నేటికీ సిపిఐ బలంగా నందిగామ నియోజకవర్గంలో ముందుకు సాగుతుందని తెలిపారు ఆయన స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నందిగామలో బలమైన పార్టీలుగా పేర్కొంటున్న వారికి నేటికీ వారి పార్టీ కార్యాలయాలు లేకపోవడం సిపిఐ పార్టీకి ఆనాటి రాజకీయవేత్త సూర్యదేవర నాగేశ్వరరావు స్థాపించిన కార్యాలయంలో ఎన్నో పార్టీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చండీగఢ్ లో జరుగుతున్న 25వ జాతీయ మహాసభలకు హాజరైన నేపథ్యంలో స్థానిక నేతల తో సూర్యదేవర నాగేశ్వరరావు పదవి వర్ధంతిని నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే దేశంలో నక్సలిజాన్ని రూపుమాపుతామంటూ కేంద్ర హోం మంత్రి మాట్లాడిన మాటలను వారు తప్పుపట్టారు ఎన్నో పోరాటాల నడుమ ఎందరో రక్త తర్పణాలు చేస్తే ఎన్నో దేశానికి మేలు జరిగే సంస్కరణలు జరిగాయని ప్రజల పక్షాన పోరాడే పోరాటాలను రూపుమాపాలని చూస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోవటం తథ్యం అని అన్నారు కామ్రేడ్స్ ను చర్చల రూపంలో పిలిచి మట్టు పెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు సిపిఐ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉంటూ రైతులకు గిట్టుబాటు ధర కావాలి అంటే రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నాలు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలబడటం జరుగుతుందని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయని ఎద్దేవా చేశారు కామ్రేడ్స్ సూర్యదేవర నాగేశ్వరరావు ఎందరో అసువులు బాసిన కామ్రేడ్స్ కు ఐదు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయనతో వారికున్న సంబంధాలను గుర్తు చేసుకొని ఆయన యొక్క కృషిని సభావేదిక ద్వారా తెలియజేశారు కష్టం వస్తే అర్ధరాత్రి అయినా అక్కడ నిలిచే వారని సామాన్య కార్యకర్తకు సైతం అండగా కామ్రేడ్ సూర్యదేవర నాగేశ్వరావు ఉండేవారని పేర్కొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు,కృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్,జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల డేవిడ్,సిపిఐ సీనియర్ నాయకులు మన్నెం నారాయణరావు,వల్లం కొండ బ్రహ్మం,పొన్నం నరసింహారావు,విశాలాంధ్ర స్టేట్ బ్యూరో చావా రవి, నియోజకవర్గ సహాయ కార్యదర్శులు షేక్ గుల్ మహమ్మద్,కట్టా చామంతి, నందిగామ మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు, జగ్గయ్యపేట మండల కార్యదర్శి వేణు సిపిఐ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు..


