- Advertisement -
అందించిన దాత గూడూరు మోహన్ దాస్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఒకేషనల్ గ్రూపుకు ప్రింటర్ ఏర్పాటు నిమిత్తం పట్టణంలోని దాత గూడూరు మోహన్ దాస్ తనవంతుగా 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ వనిత వానికి అందజేశారు. తదుపరి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలోని బాలికలకు ఒకేషనల్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని, వారికి మరింత విద్యా బోధన కొరకు ప్రింటర్ అవసరమున్నందున, దాతగా ముందుకొచ్చిన గూడూరు మోహన్ దాస్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.


