60 ఏళ్ల మహిళకు అధునాతన చికిత్సతో ఊరట
విశాలాంధ్ర అనంతపురం : 60 ఏళ్ల మహిళకు ఆరు నెలలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి ఉండడంతో కిమ్స్ సవేరా కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి అధునాతన చికిత్స ద్వారా ఊరట కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ని60 ఏళ్ల వయసున్న ఆ మహిళకు పరీక్షలు చేయగా.. ఆమె శ్వాసనాళం లోపలి భాగంలో ఏదో ఒక పదార్థం ఇరుక్కుని ఉన్నట్లు తెలిసిందన్నారు. గతంలో వేరే ఆస్పత్రిలోనూ దాన్ని తీసే ప్రయత్నం జరిగినా, అది విఫలమైంది అన్నారు. దాంతో ఇక్కడ ఆమెకు మరింత అత్యాధునిక పద్ధతిలో ప్రయత్నించి లోపల ఇరుక్కున్న పదార్థాన్ని తొలగించాలని నిర్ణయించాం. రిజిడ్ బ్రాంకోస్కొపీ, రిజిడ్ ఫోర్సెప్స్ ఉపయోగించి ఆ పదార్థాన్ని విజయవంతంగా తొలగించడం జరిగిందన్నారు.
ఆరు నెలలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి!
- Advertisement -


