విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వివిధ రకాల పన్నులు, పన్నేతర ద్వారా పంచాయతీకి వనరులు పెంచుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ జయరాముడు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామ పంచాయతీకి సొంత వనరులు ఎలా పెంచుకోవాలి అనే దానిపై సర్పంచులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ జయరాముడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే సొంతంగా వివిధ మార్గాల ద్వారా వనరులు పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పన్నులు, పన్నేతర ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని సృష్టించుకోవాలన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న నివాస, వ్యాపార భవనాలు, వ్యవసాయ భూములపై పన్నులు వసూలు చేయాలన్నారు. సినిమాలు, జాతర, ఉత్సవాలు ద్వారా వినోదం పన్నులు విధించవచ్చునన్నారు. వృత్తి చేసుకునే వారిపైన, హోర్డింగ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలపై వంటి వాటిపై కూడా పన్నులు విధించవచ్చునన్నారు. నీటి సరఫరా, విద్యుత్ వినియోగంపై కూడా పన్నులు విధించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పంచాయతీకి చెందిన దుకాణాలు, కమ్యూనిటీ హాలు, విద్యుత్ దీపాలు, నిబంధనలు పాటించని వారిపై కూడా జరిమానాలు విధించడం, బ్యాంకు వడ్డీ, విరాళాలు, బాండ్లు తదితర వంటి పన్నేతర ద్వారా కూడా పంచాయతీకి వనరులు పెంచుకొని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షలు లక్ష్మినారాయణ, మహేష్, సర్పంచులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పన్నులు ద్వారా పంచాయతీకి వనరులు పెంచుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES


