రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్యాధికారి సంకారపు నరసింహలు.
విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటి చూపుకు చిట్కాలను తప్పనిసరిగా అమలుచేసి కంటి వెలుగుతో ఉండాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, గంటి వైద్యాధికారి సంకారపు నరసింహలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు కంటిచూపు పట్ల పాటించవలసిన విధి విధానాలపై వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో మహేష్ తో పాటు జిల్లా డీఎంహెచ్వో పై రోజా బేగం, ప్రస్తుత జిల్లా అంతత్వ నివారణ అధికారిని అనురాధ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ తన సర్వీసులో కంటిచూపు పట్ల 11 చిట్కాలను, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా వివరించడం జరిగిందన్నారు. కంటిపట్ల భద్రత, ఆరోగ్యాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. ముఖ్యంగా పురిటి బిడ్డలకు కళ్ళు ఎర్రబడి పూసి కడుతూ ఉంటే డాక్టర్ని సంప్రదించి, మందులు వాడాలన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆకుకూరలు, పండ్లు తినిపించాలన్నారు. అదేవిధంగా పిల్లలకు 9 వ నెలలో తట్టు టీకా తో పాటు విటమిన్ ఏ ద్రవం కూడా ఇప్పించాలి అని తెలిపారు. మూడు సంవత్సరాల లోపల ఆరు నెలల వ్యవధిలో ఐదు మోతాదులు ఇవ్వాలని తెలిపారు. కళ్ళలో నాటు మందులు గాని, ఆకు పసరులు గాని వేస్తే కన్ను పోయే ప్రమాదం ఉందని తెలిపారు. జీవితంలో కంటికి ఎప్పుడైనా దెబ్బ తగిలితే అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్లను వెంటనే సంప్రదించాలన్నారు. దసరా, దీపావళి పండుగలలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు. అతిగా సారాయి త్రాగితే, కల్తీ సారాయి త్రాగితే కంటిచూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీడీ, చుట్ట, సిగరెట్ ఉపయోగించే వారికి చూపు మందగించే అవకాశం ఉందని తెలిపారు. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్తులు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని వారు క్రమం తప్పకుండా కళ్ళను ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. యువతీ యువకులు కంటిపట్ల గల చిట్కాలపై ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఏవో ఉదయభాస్కర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
చక్కటి కంటి చూపుకు చిట్కాలు అమలు చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


