Tuesday, November 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిట్రైన్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

ట్రైన్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఏడో వాడు కేశవ నగర్ లో పలు వీధులలో ట్రైన్స్ నిర్మాణ పనులను ఆకస్మికంగా మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ నిధులు కింద పది లక్షల వ్యయంతో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ పనులను చేస్తున్నామని తెలిపారు. అనంతరం అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడి పనుల నాణ్యతను కూడా వారు పరిశీలించారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు