Sunday, November 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంజీఎస్టీ పై పివికెకె పీజీ లో వక్తృత్వ పోటీలు..

జీఎస్టీ పై పివికెకె పీజీ లో వక్తృత్వ పోటీలు..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతపురం పట్టణంలోని పివికె కె పీజీ కళాశాలలో వివిధ విభాగాల విద్యార్థులకు జీఎస్టీ పై వకృత్వ పోటీలను డాక్టర్ మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ విద్యార్థులను బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ రెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపల్ మునికృష్ణారెడ్డి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జీఎస్టీ స్లాబులు, నైపుణ్య ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఉజ్వల ఉపాధి అవకాశాలను అందుపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి జి. శ్రీనివాసరావు, టి .హరీష్, జి. దామోదర్ నాయుడు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ పి . షేక్షావలి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు