Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనకాపల్లిరాష్ట్రంలో డబుల్ఇంజన్ సర్కార్

రాష్ట్రంలో డబుల్ఇంజన్ సర్కార్

- Advertisement -

టిడిపి, బిజెపి తప్ప జనసేన లేదా..?
ఎంపీ సీఎం రమేష్ మాటలు వెనుక అర్థం అదేనా..

విశాలాంధ్ర- అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మకవారిపాలెంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీ ను పరిశీలించడానికి ఈనెల 9న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఎంపీ సీఎం రమేష్ తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గడిచిన ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపిస్తూ. రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా సూపర్ సక్సెస్ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బిజెపి, టిడిపి మాత్రమేనా జనసేన లేదా.? అనే భావన సర్వత్ర వ్యక్తం అవుతుంది. ఒకవేళ జనసేన ఉండి ఉంటే త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కదా అనాలి.. అలాకాకుండా డబ్బులు ఇంజిన్ సర్కార్ అని ఎంపీ వ్యాఖ్యానించడం చర్చకు తావు లేపింది. ఎంపీ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా..? లేక జనసేన న మరిచిపోయారా అనే విషయంపై ఆయనే క్లారిటీ ఇవ్వాలి..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు