ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ శ్రీ
విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 పురస్కరించుకుని వైద్యకళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ శ్రీ మాట్లాడుతూ… ఈ సంవత్సరం, నినాదం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఇతివృత్తం సేవలకు ప్రాప్యత విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యాలు మరియు అత్యవసర పరిస్థితులు వంటి సంక్షోభాల సమయంలో మానసిక ఆరోగ్య మద్దతును బలోపేతం చేయడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రధానంగా మానసికంగా ఆరోగ్య సమస్యలున్న బాధితులకు మెరుగైన సేవలు కల్పించడానికి, మానసిక ఆరోగ్య సమస్యలు, వాటి నివారణలు మరియు వారికి మద్దతు ఇవ్వడం, అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు.మానసిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ శారద మాట్లాడుతూ…. మానసిక అనారోగ్యాల హెచ్చరిక సంకేతాలు అయిన నిద్ర మరియు తినే విధానాలలో మార్పులు, నిరంతర విచారం, సంఘవిద్రోహ ప్రవర్తన మరియు మానసిక స్థితి మార్పులు ఇటువంటి లక్షణాలున్న వారికి తక్షణమే మానసిక ఆరోగ్య నిపుణులతో సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, మధు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమన గోపీచంద్, మానసిక వైద్య విభాగం డాక్టర్ రవి కుమార్ , డాక్టర్ వరదరాజులు, పీజీ విద్యార్థులు డాక్టర్ కల్యాణ్, లక్ష్మి ప్రసన్న, యశ్వంత్, సోనాలి, మెడికల్ కాలేజ్ డాక్టర్లు , వైద్య విద్యార్థులు,నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.


