మంత్రి నియోజక ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులకు “ఉచిత ఉద్యోగం కల్పించే” విస్తృతమైన అవకాశాలు అందించే జాబ్ మేళా జనవరి 9వ తేదీ, 2025 న ధర్మవరం సిఎన్బి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లుమంత్రి నియోజక ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరంలో నిర్వహించే జాబ్ మేళాకు యువతీ యువకులు ఉద్యోగం కొరకు ఎవరూ కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి అన్నారు. మీ ప్రతిభను బట్టి జాబ్ లోకి తీసుకుంటారు అని తెలిపారు. అలా ఎవరైనా జాబ్ కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే 8688466361, 7998256789 కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో నిర్వహించబడుతోంది అని తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 90 ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులకు అందించేందుకు పాల్గొంటున్నాయని తెలిపారు.అందరికీ హర్షవంతమైన ఉద్యోగ అవకాశాలకై ఈ జాబ్ మేళా ఒక గొప్ప అవకాశం అని,ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని తమ జీవనోద్దేశాలను సాధించగలుగుతారు అని తెలిపారు. కావున అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకుండా, నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు అందరూ పాల్గొని, ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ధర్మవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉద్యోగావకాశాలు…
RELATED ARTICLES