Tuesday, July 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంనరాల బలహీనత, మానసిక వైద్యం కోసం ఉచిత వైద్య శిబిరం

నరాల బలహీనత, మానసిక వైద్యం కోసం ఉచిత వైద్య శిబిరం

విశాలాంధ్ర -తనకల్లు : నరాల బలహీనత మానసిక రోగుల కు వైద్యం అందించాలని ఉద్దేశంతో తులసి రామ్ పౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఈ తోడు గ్రామంలో నరాలు మరియు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పి ఉదయ్ కిరణ్ వారి సిబ్బందితో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఆ గ్రామంతో పాటు తనకల్లు తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను వైద్యుల బృందానికి తెలిపి పరిష్కరించుకోవడానికి ఉచితంగా మందులు పొందారు ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ నరాలకు సంబంధించిన వ్యాధులతో పాటు మత్తు పదార్థాల నుండి విముక్తి మానసిక జబ్బుల నుండి కాపాడడం ముఖ్యంగా వెన్నుపూస మై గ్రేట్ తలనొప్పి ఇటువంటి ప్రధానమైన వ్యాధులకు ఆపరేషన్ లేకుండా చికిత్స అందించే అధునాతన పద్ధతులు ఉన్నాయన్నారు రాయలసీమలోనే మొట్టమొదటిసారి న్యూరో మాడ్యూలేషన్ సెంటర్ తిరుపతిలోని వేదత్రయ హాస్పిటల్ నందు కలదని జబ్బులు తీవ్రత ఉన్నవారు అక్కడ సంప్రదించి వాటిని ఆపరేషన్ లేకుండా నయం చేసుకోవచ్చన్నారు ఆపరేషన్ చేసి వ్యాధులను నయం చేసేటప్పుడు మత్తు పదార్థాలు ఇచ్చి చేయడం పరిపాటని ఈ ఆర్టిఎంఎస్ చికిత్స ద్వారా ఎటువంటి మత్తు పదార్థం అవసరం లేకుండా నొప్పి లేకుండా నూతన పద్ధతులతో జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. శరీరంలో ప్రతి ముఖ్యమైన అవయవాలకు నరాల ద్వారానే వాటికి కావాల్సిన శక్తితో పాటు పనిచేసేందుకు సామర్థ్యం లభిస్తుందని ఆ నరాలనుండి సరఫరా ఆగినప్పుడు సమస్యలు మొదలవుతాయని ఆ నరాలను నూతన పద్ధతుల ద్వారా సరి చేయడం వలన జబ్బులు నయం చేయవచ్చన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారికి అవసరమైన చికిత్సలను అందించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస తులసి రామ్ పౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ హేమారాణి వందేమాతరం టీం సభ్యులు వెంకటరమణ సుంకర మురళి సుంకర గంగాధర కిష్టప్ప అంజనప్ప నవీన్ సోమశేఖర్ రమణ విశ్వనాథ్ మౌనిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు